Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య
నవతెలంగాణ- కోల్ బెల్ట్
2018 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లో గెలిచి టీిఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లాగానే రాజీ నామా చేసి తిరిగి గెలవాలని డీసీసీ జయశంకర్ జిల్లా ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య డిమాండ్ చేశారు. భూపాల పల్లి పట్టణ కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా సీఎం కేసీఆర్ అంగట్లో బర్రెలు కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విలువలు లేని రాజకీయం అని, నియంతత్వ పోకడలకు నిదర్శనమని మండిపడ్డారు. టీఆర్ఎస్ లో చేరిన 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేసి టీిఆర్‌ఎస్ పక్షాన పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు. ఆ బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క దళిత బిడ్డ కావడంతో ఆయన ఎదుగుదలను ఓర్వలేక, ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియు సి కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు పసునూటి రాజేందర్, నాయకులు మధుకర్‌రెడ్డి, అశోక్, రాములు, శంకర్, సీహెచ్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.