Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
లారీ బోర్ బండి ఆపరేటర్ నిర్లక్ష్యంతో బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మొహమ్మద్ అబ్దుల్ రహీం తెలిపిన వివరాల ప్రకారం... ఆర్అండ్ఆర్ కాలనీ గ్రామ పంచా యతీ ఆధ్వర్యంలో గ్రామ శివారు పల్లె ప్రకతి వనంలో బోరు వేస్తుండగా సుభాష్ తండాకు చెందిన బాదావత్ శత - వెంకన్న దంపతుల కుమారుడు ఈశ్వర్ (12) సరదాగా స్నేహితులతో కలిసి బోర్ వేస్తున్న దశ్యాన్ని చూడడానికి వెళ్ళాడు. బోర్ బండి ఆపరేటర్ ఎయిర్ కాంప్రెసర్ పైపును నిర్లక్ష్యంతో సరిగ్గా అమర్చకుండా ఎయిర్ కాంప్రెషర్ మిషను ఆన్ చేశాడు. దీంతో పైపు ఊడిపోయి బాలుడి తలకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం మతిచెందాడు. కోటి ఆశలతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు విగతజీవిగా మార డంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. దీంతో స్థానికుల కళ్ళు చెమ్మగిల్లాయి. బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.