Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కమలాపూర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆస్తులను కాపాడు కోవడం కోసమే బీజేపీలో చేరాడని మండల ఇన్చార్జి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం శనిగరం, గోపాల్పూర్ పలు గ్రామాల్లో కార్యకర్తల సమా వేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొన్ని నెలల క్రితం బీజేపీ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించిన ఈటల అదే పార్టీలో చేరడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీల భూములు దేవాలయ భూములను కొనకూ డదని తెలియదా అని ఈటలను ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన ఈటల ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. రైతు బంధు పథకంతో రైతాంగాన్ని ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెరియార్ రవీందర్రావు, సింగిల్ ప్రదీప్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చెరుపల్లి రాంచంద్రం సర్పంచులు గోపాల్, రవళి, రంజిత్ పాల్గొన్నారు.