Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధి భానోత్ నెహ్రూ చంద్ నాయక్.
నవతెలంగాణ-ధర్మసాగర్
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగు లను రెగ్యులరైజ్ చేసి, రెగ్యులర్ ఎంప్లాయిస్ తో సమాన వేతనాలు పెంచాలని ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధి బానోతు నెహ్రూ చంద్నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందితో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. కోవిడ్ బాధితులకు సేవలందించడంలో కీలక పాత్ర పోషించిన ఆశా, వైద్యులు సుమారు 50మందికి పైగా ప్రాణాలను కోల్పోయారని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రాతిపదికన మూడు కేటగిరీల వారిగా రూ.19వేలు, రూ.22,900, 31,040 వేతనాలు చెల్లించాలని కోరారు. జీవో 60ని సవరించి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సర్వీసులను జీవో 19 ప్రకారం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనాలు నిర్ణయించి, పీఆర్సీ 30 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమిస్తామని హెచ్చ రించారు. స్థానిక మెడికల్ ఆఫీసర్ అనుష రెడ్డి, సూపర్వైజర్ రామేశ్వరి, స్టాఫ్ నర్స్ స్వర్ణ, ఫార్మసిస్ట్ శ్రీదేవి ,ఏఎన్ఎంలు సునిత, ప్రసన్నకుమారి, ల్యాబ్ టెక్నీషియన్ అజీమ్, సిస్టర్ సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.