Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్ బెల్ట్
11వ వేతన ఒప్పందాన్ని సత్వరమే పరిష్కరించాలని చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీిఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేబీసీ సభ్యులు మంద నరసింహారావు డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని శ్రామిక భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోల్ ఇండియా 11 వేతన కమిటీకి యూనియన్ ప్రతి నిధుల ,యాజమాన్యాల పేర్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ నెల 30తో పదవ వేతన ఒప్పందం ముగియనుండడంతో 11వ వేతన ఒప్పంద చర్చలు ప్రారంభించి అగ్రిమెంట్ ను సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే నాలుగు సంఘాలు కలిసి డిమాండ్ల పత్రాన్ని కోల్ ఇండియా యాజమాన్యానికి, కోల్ సెక్రటరీకి అందజేయడం జరిగిందని అన్నారు. ఏమైనా కార్మిక సమస్యలు ఉంటే సప్లమెంటరీగా పెట్టడానికి అవకాశం ఉందని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన డీఏ వల్ల ధరల కను గుణంగా డీఏ పెరగకుండా 27.8 వద్దనే 11 వేతన ఒప్పందం నిర్వహించడంతో రాబోయే కాలంలో కార్మికులకు బేసిక్ 50 శాతం పెరగకుండా నష్టం జరిగిందని అన్నారు. 9 వ వేతన ఒప్పందం లో56.3 శాతంతో 87 శాతం పెరిగితే, పదవ వేతన ఒప్పందం లో 44.1 శాతం వద్ద ఉండడంతో 67శాతం బేసిక్ పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. 11వ వేతన ఒప్పందాలు ప్రధానంగా దిగిపోయే కార్మికుల పెన్షన్ పెరుగుదల, మెడికల్ స్కీం ఖర్చులను కార్మికుల తరఫున యాజమాన్యమే భరించాలన్నారు. పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం కింద గతంలో లాగా 21 శాతం కాకుండా 30 శాతం ఉంటేనే కార్మికులకు మేలన్నారు. భవిష్యత్తులో కూడా కార్మికుల పక్షాన నిష్పక్షపాతంగా పోరాడడానికి సిద్ధమ న్నారు. బ్రాంచ్ అధ్యక్షులు రామస్వామి, కార్యదర్శి రాజయ్య, నాయకులు రమేష్, ఐలయ్య పాల్గొన్నారు.