Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
చారిత్రాత్మకమైన వరంగల్ మహా నగరంలో సెప్టెంబర్ మూడవ వారంలో మూడు రోజుల పాటు కనివినీ ఎరుగని రీతిలో పద్మశాలి ప్లీనరీలను నిర్వహించనున్నట్టు అమ్మఒడి సష్టికర్త, వరల్డ్ పద్మశాలి క్లబ్, మోక్షారామం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రామ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం స్థానిక అమ్మఒడి భవన్లో వరల్డ్ పద్మశాలి క్లబ్ ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశాలి సేవా సంఘం అవిర్భవించి వందేండ్లు పూర్తైన సందర్భంగా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కార్యవర్గం అభిప్రాయపడిందన్నారు. వరంగల్ నగరంలో ప్లీనరీలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దేశంలో మరెక్కడా లేనంత పద్మశాలి సామాజిక వర్గం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉందని అన్నారు. అందుకు తగిన రీతిలో పద్మశాలి శతజయంతి ఉత్సవాలు ప్రతిబింబించాలన్నారు. ప్లీనరీలలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వివిధ రంగాలలో రాణించిన ఉత్తములను సన్మానించాలని నిర్ణయించామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధులకు మూడు రోజుల పాటు భోజన వసతి, లాడ్జింగ్, రవాణ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ఐఎఎస్, ఐపిఎస్, పద్మశాలి ప్రవాస భారతీయులు, నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ ప్రతినిధులను ఆహ్వా నించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముగింపు సమావేశం, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107 జయంతి వేడుకలు కలుపుకొని ప్లీనరీలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డబ్ల్యూపీసీ కార్యవర్గ సభ్యులు ఈగ మల్లేశం, మంతెన రమేష్, బాసాని చంద్ర ప్రకాష్, బలభద్ర రాము, చందా మల్లయ్య, గడ్డం కేశవమూర్తి, వేముల సదానందం నేత, వలస సుధీర్, మార్గం కుమారస్వామి, భేతి అశోక్ బాబు, బాల్నే శరత్ బాబు, కూరపాటి సుదర్శన్, రామ ప్రసాద్, బిట్ల సమ్మయ్య, రవి, సుదీర్ పాల్గొన్నారు.