Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
వృద్ధులపై వేధింపు చర్యలను నివారించాలని సీనియర్ సిటిజన్ అధ్యక్షులు ఎర్ర జగన్మోహన్ రెడ్డి కోరారు. పట్టణం లోని సీనియర్ సిటిజన్ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ వయో వృద్ధులపై వేధింపుల నివారణ దినోత్స వంలో ఆయన మాట్లాడారు. వయో వృద్ధులు కష్టపడి సంపాదించిన ఆస్తులను అనుభవిస్తూ వారిని పోషించ డానికి కొందరు వారసులు నిరాకరించడం బాధకర మన్నారు. మానసిక వేధింపులకు గురిచేసి మానవత్వాన్ని మరిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చట్టాలను పగడ్భంధిగా అమలు చేసి వేధింపులను నివారించాలని కోరారు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ బాధ్యులు వడ్లకొండ సాంబయ్య, చిలుముల సత్తయ్య, తౌటి కృష్ణారెడ్డి, పోలీసు మల్లయ్య, వీరయ్య, కొమురయ్య, సారయ్య, భూపాల్ రెడ్డి, బాల్నే సర్వేశం, లక్ష్మయ్య, రుద్ర బుచ్చయ్య, సుధాకర్, వీరస్వామి, కరుణ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
వయో వద్ధులను కాపాడుకుందాం : నరసయ్య
నయీంనగర్ : ప్రపంచ వద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపాలపురం చౌరస్తా కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఉపాధ్యక్షులు నాగులగాం నరసయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాన వక్త దామోదర్ మాట్లాడారు. వయో వద్ధులను కాపాడు కోవా ల్సిన బాధ్యత అందరి ఉందన్నారు. అనేకమంది తమ కుటుంబ సభ్యుల, సమాజం, ప్రభుత్వ నిరాదరణకు గురవు తున్నారన్నారు. వద్ధాశ్రమాలలో,అనాధాశ్రమం ఒంటరి జీవిత పోరాటం చేస్తున్నవారున్నారని తెలిపారు. ప్రభు త్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వయోవద్ధుల సంఘాలు ప్రజ లను చైతన్య పరిచి సమస్యను అధిగమించాలన్నారు. కార్యదర్శి తేరాలు యుగంధర్, రాజేందర్, ఉపేంద్ర చారి, మలహల్రావు, ప్రభాకర్‌రెడ్డి, బురాణ్ ఖాన్ పాల్గొన్నారు.