Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో కొన సాగుతున్న పారిశుధ్యం పనులను మండల ప్రత్యేక అధికారి, జెడ్పీ సీఈఓ శోభారాణి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాల పరిశుభ్రత, శానిటేషన్,బ్లీచింగ్ తదితర వాటిపై పంచాయతీ కార్మికులకు అవగాహన కల్పించారు. రోడ్లకిరువైపులా ఉన్న చెత్తను శుభ్రం చేయించారు. అనంతరం మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రి మరమ్మతు పనులను పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి రాణిబాయి, ఎంపీఓ ప్రసాద్, పీఆర్ డీఈ సాయిలు, ఏఈ రాజేందర్‌రెడ్డి, టీ ఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్, బి రామారావు, డాక్టర్ రాజ్‌కుమార్, కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.