Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ గౌతమ్
- ఎస్పీతో కలిసి ఐసోలేషన్ కేంద్రాల పరిశీలన
నవతెలంగాణ-మహబూబాబాద్
కరోనా నివారణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్ధవంతంఆ పని చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ఆయన మంగళవారం డోర్నకల్ మండలంలో పర్యటించారు. తోడూళ్లగూడెం, మన్నెగూడెం గ్రామాల్లోని ఐసోలేషన్ కేంద్రాలను పరిశీలించారు. సర్పంచ్ అంజయ్య, మన్నెగూడెంలో పీఏసీఎస్ అధ్యక్షుడ కొండపల్లి సీతారామరెడ్డి, తదితరులతో మాట్లాడి సమస్యలు, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. వైరస్ లక్షణాలు లేకపోయినా మందులు అందజేయాలని చెప్పారు. ఇండ్లలో సౌకర్యాలు లేని వారి కోసం గ్రామాల్లోని పాఠశాలల్లో, రైతు వేదికల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని పోలీసుల సహకారంతో ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. తొలుత డోర్నకల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కరోనా నియంత్రణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. హైరిస్క్ ప్రాంతాలపై మండల టాస్క్ఫోర్స్ టీమ్ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ తగ్గేలా చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ యోగేష్ గౌతమ్,జిల్లా వైద్యాధికారి హరీష్రాజ్, వైద్యాధికారి విరాజిత, మున్సిపల్ చైర్మెన్ వీరన్న, తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.