Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొల్లు దేవేందర్
- కరోనా బాధితులకు పండ్లు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
ఐసోలేషన్ కేంద్రంలోని కరోనా బాధితులకు దాతలు సాయం అందించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొల్లు దేవేందర్, సర్పంచ్ష్ట్ర ఇర్ప సునీల్‌దొర అన్నారు. సానికొమ్ము కార్తీక్‌రెడ్డి కూతురు జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని ఐసోలేషన్ సెంటర్లోని కరోనా బాధితులకు, స్థానిక పీహెచ్‌సీలోని పేషెంట్లకు మంగళవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవేందర్, సునీల్ దొర మాట్లాడారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని, కరోనా టీకా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు అరెం లచ్చుపటేల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంట సాయిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు యానాల సిద్దిరెడ్డి, జగన్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాక రాజేందర్, యూత్ నాయకులు మనోజ్‌రెడ్డి, గట్టు రంజిత్, వర్దెల్లి బాలు, తదితరులు పాల్గొన్నారు.