Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుబంధు కోఆర్డినేటర్ యాకాంతరావు కేసీఆర్, ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ-పాలకుర్తి
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు అన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేయడం పట్ల హర్సం వ్యక్తం చేస్తూ మండలంలోని పాలకుర్తి, ఈరవెన్ను, గూడూరు, వావిలాల, విస్నూరు, ముత్తారం, చెన్నూరు గ్రామాల క్లస్టర్లలోని రైతు వేదికల వద్ద తో మంగళవారం సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మెన్ ముస్కు రాంబాబు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్‌రెడ్డితో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులు పెట్టుబడులకు ఇబ్బందులు పడకూడదనే నిర్లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక దష్టి పెట్టి పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ముస్కు నిర్మల చంద్రబాబు, మంద కొమురయ్య, గంట పద్మ భాస్కర్, యాకయ్య, భాస్కర్‌రెడ్డి, పూస్కూరి పార్వతి రాజేశ్వరరావు, ఎంపీటీసీలు యాకయ్య, కలింగరావు, రైతుబంధు సమితి మండల డైరెక్టర్ గుగులోతు యాగలక్ష్మీ, ఐలమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేల్పుల దేవరాజు, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మారుజోడు సంతోష్, ఏఈఓ బొడ శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.