Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు
- రైతు వేదికలు ప్రారంభం
నవతెలంగాణ-ధర్మసాగర్/వేలేర్
రైతును రాజులా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ధర్మసాగర్ మండలంలోని రాయిగూడెం, పెద్దపెండ్యాల, ఎల్కుర్తి, ధర్మసాగర్, నారాయణగిరి, వేలేరు మండల పరిధిలోని పీచర, వేలేరు, షోడశపల్లి గ్రామాల్లోని రైతు వేదికలను రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినరు భాస్కర్, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి మంత్రులు నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ పల్లా స్వగ్రామమైన షోడషపల్లిలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రైతు ఆత్మీయ సమ్మేళన సమావేశంలో మంత్రులు మాట్లాడారు. రైతులను రాజు చేసేందుకు 24గంటల ఉచిత విద్యుత్, ఉచిత ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్టు తెలిపారు. రైతు మరణాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఏ దేశంలో లేనివిధంగా రైతుబంధు, బీమా పథకాలను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. రూ.30 వేల కోట్లు రైతు సంక్షేమానికి కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు. లెక్కల్లో చెప్పడమే తప్ప రైతు సంక్షేమం కోసం రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల కోసం రైతు సమన్వయ సమితి కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. భవిష్యత్‌లో పంటలపై శిక్షణా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అనంతరం పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ వర్షాకాలానికి 63లక్షల25 వేల మంది రైతులకు రైతులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేశారని అన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ ఫలాలను ప్రజలు అడక్కుండానే అమలుజేసి అందజేస్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని రెండు మండలాలలో 8 క్లస్టర్ల రైతు వేదికలను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. క్లస్టర్ల అభివద్ధికి ఒక్కో క్లస్టర్‌కు రూ.10 లక్షలు మంజూరు చేయాలన్నారు. ఉకార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ సుధీర్ కుమార్, డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్రావు, ఏఎంసీ చైర్మెన్ చింతం సదానందం, వైస్ చైర్మెన్ గుజ్జుల రాంగోపాల్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లలిత యాదవ్, ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ చాడ సరితా విజేందర్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కో ఆప్షన్ మెంబర్ జుబేదా లాల్ మహమ్మద్, వైస్ ఎంపీపీ అంగోతు సంపత్, కో ఆప్షన్ సభ్యులు జానీ, సర్పంచులు కాయిత మాధవ రెడ్డి, మేక రవీందర్, కొట్టే రాజేష్, గోదెల రాజిరెడ్డి, ధర్మారెడ్డి, మాలోతు రాంచందర్, మాలోతు సంపత్, మార్క మల్లిక, ధర్మసాగర్ నుంచి ఎంపీపీలు నిమ్మ కవిత రెడ్డి, కేసిరెడ్డి సమ్మిరెడ్డి, జెడ్పీటీసీలు పిట్టల శ్రీలత, ఏడీఏ దామోదరరెడ్డి, మండల వ్యవసాయ అధికారి పద్మ, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు, వైస్ ఎంపీపీ బండారి రవీందర్, సర్పంచులు ఎర్రబెల్లి శరత్, కర్ర సోమిరెడ్డి, మామిడి రవీందర్, నాయకులు బేర హరీష్, వీరన్న, రమేష్ పాల్గొన్నారు.