Authorization
Sat March 22, 2025 02:38:48 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-భూపాలపల్లి
వ్యవసాయ పనులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన అభివద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి జిల్లాలో వ్యవసాయ, వైద్య, ఆరోగ్యం, విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ వర్షాకాలంలో 95వేల ఎకరాల్లో వరి, లక్షా25వేల ఎకరాల్లో పత్తి, 28 వేల ఎకరాల్లో మిర్చి, 1259 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు, పత్తిలో అంతర పంటగా కంది ఇతర పంటలను పండించనున్నారని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు మొదలయ్యాయని, ఎరువులు, విత్తనాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ విత్తనాలతో నష్టపోకుండా ప్రత్యేక బందాల ద్వారా పర్యవేక్షించాలన్నారు. రైతులందరి ఖాతాలలో రైతుబంధు జమ అయ్యేలా చూడాలన్నారు. ఈసారి వాణిజ్య పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాల ని అన్నారు. ఉద్యానవన పంటలైన కూరగాయలు, పండ్ల తోటల పెంపకంపై రైతులు దష్టి సారించేలా చూడాలన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని, వర్షాకాలం ప్రారంభమైనందున మళ్లీ ప్రబలకుండా సానిటేషన్ నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని, ప్రభుత్వ లక్ష్యం మేరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, ఐసోలేషన్ కిట్లను అదనంగా సమకూర్చుకో వాలని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వంగిపోయిన, పడిపోయిన విద్యుత్ స్తంభాలను గుర్తించి వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులను పరిశీలించి త్వరగా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, జేసీ కూరాకుల స్వర్ణలత, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, జిల్లా వ్యవసాయ అధికారి విజరుభాస్కర్, డీఎంహెచ్ఓ శ్రీరామ్ పాల్గొన్నారు.
వికలాంగుల అభ్యున్నతికి విశేష కషి
వికలాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం విశేష కషి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ సమీపంలోని సింగరేణి సేవాభవన్ ఆవరణలో స్త్రీ,శిశు సంక్షేమం,వయోవద్ధులు, వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆలింకో సంస్థ సహకారంతో జిల్లాలోని 101 మంది వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. గడిచిన ఏడేండ్లలో వికలాంగుల సంపూర్ణ అభివద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వికలాంగులు వివిధ రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.500 వికలాంగ పింఛన్‌ను రూ.1500కు అనంతరం రూ.3016 పింఛను పెంచినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల విధంగానే వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి చూపిస్తున్నామన్నారు. త్వరలోనే జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఆక్సిజన్ ప్లాంట్‌ను, మందుల కొరత తీర్చేందుకు రీజనల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టి డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు. అనంతరం జెడీప చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిణి మాట్లాడుతూ... కాటారంలో కూడా క్యాంపు నిర్వహించి ఆ ప్రాంత వికలాంగులకు కూడా కత్రిమ అవయవాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన అన్ని అభివద్ధి పనులను మంత్రి సహకారంతో సకాలంలో పూర్తి చేయించి జిల్లా అభివద్ధిలో భాగస్వాములవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జనవరిలోనే క్యాంపు నిర్వహించి సహాయ పరికరాలను అందించేందుకు లబ్ధిదారులను గుర్తించామని, కత్రిమ అవయవాలను అందించేందుకు వికలాంగులను గుర్తించామన్నారు. వారికి త్వరలోనే కత్రిమ అవయవాలు అందిస్తామన్నారు. సదరం క్యాంపు నిర్వహించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు త్వరలోనే పింఛను వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులు ఆత్మస్థైర్యంతో జీవించేలా చేస్తున్న సీఎం కేసీఆర్‌కు వికలాంగులు రుణపడి ఉంటారన్నారు. జేసీ కూరాకుల స్వర్ణలత, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గం వెంకటరాణి, ఎంపీపీ లావణ్య, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.