Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణలో ప్రతి జిల్లా పచ్చదనంతో కళకళలాడుతూ ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివద్ధి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయం నుంచి మంత్రి, హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ 33 జిల్లాల జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎఫ్ఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులతో ఏడో విడత హరితహారం, పల్లె ప్రకతి వనం,పట్టణ ప్రకతి వనం, మల్టీ లెవెల్ నర్సరీలకు భూమి గుర్తింపు, శానిటేషన్, సీజనల్ వ్యాధులు, కరోనా వ్యాక్సినేషన్, కలెక్టరేట్ కాంప్లెక్సెస్ నిర్మాణాల పూర్తి సంబంధిత విషయాలపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాల వారీగా ఏడో విడత హరితహారం సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. మెగా నర్సరీలు రూపకల్పనకు జిల్లాలో మూడు, నాలుగు చోట్ల భూమిని గుర్తించి నర్సరీలు ఏర్పాటు చేసి 10 లక్షల మొక్కలు తగ్గకుండా నాటేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన కలెక్టరేట్ నిర్మాణం ప్రాంగణంలో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాలని అన్నారు. నూతన కలెక్టరేట్లను త్వరగా పూర్తి చేసి ప్రారంభించేల చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం దష్టిలో పెట్టుకుని జిల్లాలో ప్రజలకు వ్యాధులు ప్రభలకుండా ముందస్తు సమావేశాలు నిర్వహించి పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, గ్రామపంచాయతీలు, పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేల చూడాలని ఆదేశించారు. కలెక్టర్ కష్ణ ఆదిత్య మాట్లాడుతూ జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నట్లు తెలిపారు. మల్టీ లెవెల్ నర్సరీలో నిర్మాణానికి భూపాలపల్లి, ములుగు రెండు జిల్లాల పరిధిలో 20 మండలాల్లో భూమి గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ధరణి భూ సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఏడో విడత హరితహారం నిర్వహించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖలు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. వర్షాకాలం దృష్ట్యా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డీఎఫ్ఓ లావణ్య , జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఆర్డీఓ పురుషోత్తం, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటేష్, డీఎంహెచ్ఓ శ్రీ రామ్ పాల్గొన్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల పరిశీలన
పోచమ్మ మైదాన్ : పాత సెంట్రల్ జైలు ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి శంకుస్థాపనకు కావాల్సిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఈనెల 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనుండగా జరుగుతున్న పనులను మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్‌తో కలిసి బుధవారం పరిశీలించి ఆయన మాట్లాడారు. వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్ గా తీర్చి దిద్దేందుకు అత్యాధునిక హంగులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్టు తెలిపారు. శంకుస్థాపనకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నగరాన్ని అభివద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ప్రత్యేక ప్రణాళికలతో ఉన్నారని అన్నారు. ఎంపీ బండ ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఈఎన్సి గణపతి రెడ్డి, వాస్తు నిపుణులు తేజ, కుడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ సీపీ తరుణ్ జోషి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.