Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
రైతు కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో బుధవారం 25మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా చెక్కులు పంపిణీ చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. రైతు ఆకాల మరణం చెందితే వారిపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడొద్దని బీమా పథకంతో సీఎం ఆదుకుంటున్నాడన్నారు. బాధిత రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందించి అండగా నిలుస్తున్నాడన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రపంచం మెచ్చుకుంటోందన్నారు. ఇప్పటి వరకు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 377 మంది రైతు కుటుంబాలకు బీమా పథకం ద్వారా రూ.18.85కోట్లను అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ మోతె కలమ్మపద్మనాభరెడ్డి, ఏడీఏ టీ.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ మోతె జయపాల్ రెడ్డి, నల్లభారతీ, పలు గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు, రైతుబందు కమిటీ సభ్యులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
పీజీ కళాశాల ఏర్పాటుకు మౌళిక సదుపాయాలు కల్పిస్తాం
నర్సంపేటలో కాకతీయ విశ్వవిద్యాలయ పీజీ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాకతీయ విశ్వవిద్యాలయ అధికారుల బందం పర్యటించింది. ఈ సందర్భంగా బృందంతో ఎమ్మెల్యే పీజీ కళాశాల అవశ్యకతపై తగిన మౌళిక సదుపాయాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పీజీ కళాశాల ఏర్పాటు అవసరమన్నారు. ఈ ప్రాంతాన్ని ఎడ్యూకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్ఫంతో ఇప్పటికే గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే 250 పడకల ఆసుపత్రి ప్రక్రియ ప్రారంభం కాబోతుందన్నారు. పాకాల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పాకాలలో 1500 మెడిసినల్ ప్లాంట్లు ఉన్నాయని, వీటిని మరింతగా పెంపకం చేసేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుందన్నారు. ఏకకాలంలో ఎనిమిది వందల మంది కూర్చునే ఆడిటోరియం అందుబాటులోకి రాబోతుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల ఏర్పాటుకై కావాల్సిన భూమి, భవన సముదాయం అందుబాటులో ఉన్నాయన్నారు. పీజీ సెంటర్లో అవసరమయ్యే అధ్యాపకుల పోస్టులను మంజూరు చేయిస్తామన్నారు. ఈ ఏడాది నుంచే పీజీ కళాశాల తరగతులు నిర్వహించేలా తోడ్పాడాలని సూచించారు. కేయు ప్రొఫెసర్ మనోహర్దీన్, కేయూ పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ గుండాల మధన్‌కుమార్, ప్రిన్సిపల్ బి చంద్రమౌళి, ప్రొఫెసర్ వరలక్ష్మీ, ప్రణరు కుమార్, అధ్యాపకులు టి రమేష్ శ్రీనాథ్, సుమతి, లఖన్ సింగ్, ప్రసూన, సత్యనారాయణ, కుమారస్వామి, త్యాగయ్య, ఏవో స్వరూప పాల్గొన్నారు.