Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖిలా వరంగల్
గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని డి ఎం హెచ్ వో డాక్టర్ లలితాదేవి, 37వ డివిజన్ కార్పొరేటర్ భోగి సువర్ణ లు తెలిపారు. బుధవారం దిశ పౌండేషన్ సుస్మిత ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ పి హేచ్ సి సెంటర్ లో గర్భిణులకు పౌష్టికాహారంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణులు ఎల్లవేళల డాక్టర్ల సలహాలు పాటించాలన్నారు. క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని సూచించారు. దిషా ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీ యమన్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేద ప్రజలకు సాయం అందజేయాలన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు వారు నిత్యావసర సరుకుల తోపాటు పండ్లు, కూరగాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఐఓ గీతాలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ అనురాధ, గైనకాలజీస్ట్ డా,పద్మజా, సీఓ మోహాన్, రాజేష్, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్, టిఆర్ఎస్ నాయకుడు బోగి సురేష్, జనార్దన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.