Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-కమలాపూర్
మాజీ మంత్రి ఈటలది ఆత్మగౌరవ పోరాటం కాదని ఆస్తి రక్షణ పోరాటమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. బుధవారం మండలంలోని కమలాపూర్, గూడూరు అంబాల, కానిపర్తి, శంభునిపల్లి దేశరాజుపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ... ఆరు సార్లు గెలిచిన అని గొప్పలు చెప్పుకునే ఈటల హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి స్వలాభం కోసమే పనిచేశారని మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరికపై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారని, ప్రజలకు ఏమిసమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈటల ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకిచ్చే గౌరవం అపారమైనదని, అలాంటి గొప్ప వ్యక్తిని విమర్శిస్తే సహించేదిలేదన్నారు. హుజురాబాద్ గడ్డ టీఆర్ఎస్ అడ్డ అని ఎవరెన్ని ఎత్తులు వేసినా టీఆర్ఎస్ను ఏమీ చేయలేరన్నారు. అనంతరం గ్రామంలో అభివద్ధి పనులు, తదితర సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో సమీక్షించారు. అందరూ కలిసికట్టుగా గ్రామాభివద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు విజయ తిరుపతిరెడ్డి, అంకతి సాంబయ్య, మాట్ల రవీందర్ రవీందర్రెడ్డి, రమేష్, వైస్ ఎంపీపీ కళ్యాణి అశోక్, ఎంపీటీసీలు మెండు రాధిక, రమేష్, మాట్ల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మెన్, వైస్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.