Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు గ్రామస్తుల వినతి
నవతెలంగాణ-భూపాలపల్లి
గొర్లవేడు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని జిల్లా పర్యటనలో ఉన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కు బుధవారం గ్రామస్తులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతిపెద్ద గ్రామపంచాయతీ గొర్లవేడు గ్రామం అని ఈ గ్రామం సుమారు ఐదు వేలకు పైగా జనాభా ఉన్నారన్నారు ఈ గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని దీని చుట్టూ సుమారు 18 గ్రామాలు ఉన్నాయని ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి ఈ గ్రామాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున అన్ని వనరులు ఉన్నా ప్రభుత్వ భూములు భవనంలో , ఉన్నాయి కాబట్టి -పాలన మెరుగుపరిచేందుకు గొర్లవేడు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరారు. వినతి పత్రం అందించిన వారిలో గ్రామస్తులు గుర్రం సంపత్, సతీష్ ,రాజయ్య, రమణ, కష్ణ రమేష్ ,తదితరులు ఉన్నారు.-