Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-పర్వతగిరి
మండల కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏడవ విడత హరిత హారం కార్యక్రమం సన్నద్ధ తలో భాగంగా పంచాయతీ కార్యదర్శు లకు, ఉపాధి హామీ సిబ్బందికి మొక్కలు నాటే విధానంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అవగాహన కల్పిం చారు. రోడ్ల వెంబడి నాటే మొక్క ఒకటి న్నర మీటర్ ఎత్తు ఉండేలా చూసుకుని ట్రీ గార్డు ఏర్పాటు చేయాలన్నారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎంపిఓ మధుసూదన్, ఎపీిఓ సుశీల్ కుమార్, ఫారెస్ట్ నర్సరీ వనసేవక్ రాజు పాల్గొన్నారు.
మొక్కల పంపిణీ
మండలం మోత్యతండాలో హరితహారంలో భాగంగా బుధవారం సర్పంచ్ బాదవత్ జ్యోతి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణ గా మార్చి భావితరాలకు బహుమతి గా అందించాలని అన్నారు. నాయకులు రవి పాల్గొన్నారు.
నడికూడ : హరితహారంలో భాగంగా మండలంలోని సర్వాపూర్, ధర్మారం గ్రామాల్లో సర్పంచ్లు భోగి శ్రీలత రవీందర్, గోల్కొండ ఉమా సదానందం ఆధ్వర్యంలో ఇంటింటికి బుధవారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనసూర్య, జెడ్పీటీసీ సుమలత మాట్లాడారు. ప్రతి గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటి హరిత వనంలా తీర్చిదిద్దాలన్నారు. ఎంపీటీసీ మేకల సతీష్, ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, ఎంపీిఓ అఫ్జల్, కార్యదర్శి శ్రావ్య పాల్గొన్నారు.