Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పోచమ్మమైదాన్
వరంగల్ నగరాన్ని సుందరంగా పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా గ్రీనరీ, ఐల్యాండ్, సెంట్రల్ మెడియన్స్లలో హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏటా అధికారులు ఉధృతం చేస్తున్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో ఏడవ హరితహారంలోనైనా మొక్కల రక్షణ చర్యల పైన అధికారులు దృష్టి పెడుతారా? లేదా? అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా పరిధి 2015 నుండి హరి తహారంలో భాగంగా లక్షలాది మొక్కలు ఏటా నాటుతు న్నారు. గతేడాది 44 లక్షల మొక్కలు నాటి సుమారు 80 శాతం మొక్కలు బతికేలా చూడాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ అమలు కావట్లేదు. 2021లో 12.20 లక్షల మొక్కలు నాట డానికి బల్దియా నిధుల నుండి రూ.20 కోట్లు కేటాయిం చారు. అధికారులు సైతం హరితహారం మొక్కలు నాట డానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. 4500 ట్రీగార్డ్స్ ఇప్పటికే వచ్చాయని తెలిసింది. కానీ, హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన అనంతరం రక్షణ చర్యలు లేక పశువులు మేస్తున్న దుస్థితి నెలకొంది. దీంతో నాటిన స్థలంలోనే రహదారులకు ఇరువైపులా మొక్కలు పడేస్తున్నారు. గత సంవత్సరంలో హరితహారం మొక్కలు నాటేందుకు డివిజన్ స్థాయిలో కార్పోరేటర్లను, మహిళా సంఘాలను, ప్రత్యేక సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ సంరక్షణ చర్యలు చేపట్టట్లేదు. అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని పరిస్థితి. 7వ విడత హరితహారంలోనైనా ఖచ్చితమైన ప్రణాళికలు చేపట్టి, రక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తేనే హరితహారం విజయవంతమయ్యే అవకాశం లేదు. సుమారు ఏడేండ్లుగా హరితహారం మొక్కలు నాటుతున్నా, అవి ఎంత మేరకు బతుకు తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భవి ష్యత్ తరాలకు పచ్చదనాన్ని పెంపొందించుటకు శాశ్వ తమైన రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.