Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామ్శెట్టి లత లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపీటీసీలు మేకల శ్రీనివాస్, గజ్జి ఐలయ్య పాల్గొన్నారు.
చిట్యాల : ప్రజాప్రతినిధుల వేతన పెంపును హర్షిస్తూ బుధవారం మండల కేంద్రలోని ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గొర్రె సాగర్ మాట్లాడుతూ కరోనా విపత్తు దష్ట్యా దేశమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు రైతుబంధు ప్రకటించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, అదే తరుణంలో ప్రజాప్రతినిధుల ఇబ్బందులను గుర్తించి వారికి వేతనాన్ని పెంచడం ఒక గొప్ప నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, సర్పంచ్లు ఇరుకులపాటి పూర్ణ చందర్ రావు, తొట్ల లక్ష్మీ ఐలయ్య, నందికొండ కవిత పాపిరెడ్డి, పువ్వాటి రాణి వెంకన్న, అజీరా బేగం శంషోద్దీన్, యేలేటి సరోజన, ఎంపీటీసీలు కట్కూరి పద్మ నరేందర్, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు జంబుల తిరుపతి,కో ఆప్షన్ సభ్యుడు రాజ్మాహ్మద్ తదితరులు పాల్గొన్నారు.