Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని పాలకులు, అధికారులు
నవతెలంగాణ-పరకాల
అధికారుల నిర్లక్ష్యంతో గృహ యజమానులు ఇష్టారాజ్యంగా సీసీ రోడ్డు పైనే కార్ పార్కింగ్ కోసం రేకుల షెడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు పట్టణంలోని మల్లారెడ్డిపల్లి వీధినే నిదర్శనం. పాలకుల అండతో, అధికారుల నిర్లక్ష్యంతో కొంతమంది రోడ్లను ఆక్రమంచి కార్ల షెడ్ల నిర్మాణం చేస్తున్న పరిస్థితి. సదరు వ్యక్తి మున్సిపల్ కార్యలయంలో పని చేయడంతో అధికారుల అండ ఉందంటూ ధీమాతో డ్రైనేజీ నిర్మాణానికి రెండున్నర ఫీట్లు దాటి కార్ పార్కింగ్ కోసం షెడ్లు నిర్మించినట్టు ఆరోపణలొస్తున్నాయి. నిత్యం వీధుల్లో తిరిగే మున్సిపల్ సిబ్బంది, అధికారులు షెడ్ల నిర్మాణం కనిపించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్లను ఆక్రమించి షెడ్ల నిర్మాణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని నిర్మాణం తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు
మున్సిపల్ పరిధిలో రోడ్లను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా గహ యజమానులు షెడ్ల నిర్మాణం చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
-మున్సిపల్ కమిషనర్ శేషు