Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యవసాయ అధికారి రాంనర్సయ్య
నవతెలంగాణ-వర్ధన్నపేట
గ్రామాల్లో నిర్మించిన క్లస్టర్ రైతు వేదికలను రైతులు సద్విని యోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాంనర్సయ్య సూచించారు. బుధవారం మండలంలోని దమ్మన్నపేట క్లస్టర్ రైతువేదికలో ఆయన రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున రైతులకు కావాల్సిన వ్యవసాయ సమాచారం, విత్తనాల ఎంపిక, శుద్ధి, పంటల సాగు వివరములు, చీడపీడల నిర్మూలన, వాతావరణ, మార్కెటింగ్ సమాచారం తెలుసుకొనుటకు రైతు క్లస్టర్ వేదికలో అడిషనల్ వ్యవసాయా ధికారి అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు. రైతుబంధు పథకం, రైతు బీమా, పంటల నమోదు కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. రైతులు ఎవరు కూడా వ్యవసాయ అధికారి కార్యాలయంకు రాకుండా తమకు కావాల్సిన సమాచారాన్ని గ్రామాల్లో నిర్మించిన క్లస్టర్ రైతువేదికల ద్వారా పొందాలని కోరారు. కొత్తగా పట్టా పాస్ బుక్కులు పొందిన రైతులు నేరుగా రైతువేదిక వద్ద ఉన్న ఏఈవోకు అందించినట్లయితే వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి క్లస్టర్ వైస్ గా వివరాలు వెల్లడించారు. రైతులు వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనాలల ఎంపిక, రైతుబంధు, రైతుబీమా తదితర అంశాలపై కావలసిన సమాచారం అందించడానికి మండల వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.