Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-గోవిందరావుపేట
కరోనా నియంత్రణకు కలిసి పని చేద్దామని ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్‌తో కలిసి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసేందుకు తీసుకొచ్చిన శానిటేషన్ యంత్రాన్ని బుధవారం ఆమె స్ప్రే చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. కరోనా నేపధ్యంలో టీపీసీసీ కార్యదర్శి పైడకుల అశోక్ గ్రామానికి యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలు పాటించాలని సూచించారు.
జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలి
కరోనాతో మతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీతక్క హాజరై మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వాలకు నడుమ వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమన్నారు. జర్నలిస్టులకు ఉపకార వేతనాలు అందించి ఆదుకోవాలని కోరారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మండల కేంద్రానికి చెందిన గోగినేని ఎర్రమ్మ, అల్లంనేని దేవేందర్‌రావు భార్య పద్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, సహకార సంఘం చైర్మన్ పాన్నల ఎల్లారెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సీతారాం నాయక్, మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మి జోగానాయక్, భూక్యా సుక్య, ముద్ద బోయిన రాము, జాడి రాంబాబు, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అబ్బు రమేష్, మండల అధ్యక్షుడు తాటి రాజబాబు, జిల్లా నాయకులు పాలడుగు వెంకటకష్ణ, ఎంపీటీసీ ఏడుకొండల్, చల్వాయి ఎంపీటీసీ చాపల ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
రైతు సేవా కేంద్రాలను వినియోగించుకోవాలి
తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. మండలంలోని పస్రా గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు లభ్యమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమరస్వామి, పీఏసీఎస్ చైర్మెన్ పన్నాల ఎల్లారెడ్డి, పస్రా సర్పంచ్ ముద్దబోన రాము, గాంధీనగర్ సర్పంచ్ భూక్య సూక్యనాయక్, కడబోన రవి, చెరుకుల సురేష్, దేెపాక కృష్ణ, బద్దం భరత్‌రెడ్డి, ఏఓ కైత జితేందర్‌రెడ్డి, ఏఈఓలు ప్రత్యూష, మహి పవన్ పాల్గొన్నారు.