Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
పేదలందరికీ ప్రభుత్వమే ఉచితంగా టీక అందిస్తుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో సిబ్బందికి, హమాలీలకు, కూలీలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కోవిడ్ నిరోధక టీకా ఇప్పించడమే లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు. దశలవారీగా అన్ని తరగతుల ప్రజలకు ఉచితంగా టీకా అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మార్కెట్ కమిటీ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఉమ పిచ్చిరెడ్డి, సుధగాని మురళీ, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, సీనియర్ నాయకులు మార్నేని వెంకన్న, చిట్యాల జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.
'ఆర్యూబీ' పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) రీడిజైనింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ కోరారు. పట్టణంలోని రీడిజైనింగ్ పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాహనదారులకు, వ్యాపారస్తులకు సౌకర్యంగా ఉండేలా ఆర్యూబీని రీడిజైన్ చేసినట్టు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మెన్ ఫరీద్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గద్దె రవి, ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్ధన్, రాష్ట్ర నాయకులు మార్నేని వెంకన్న, బోనగిరి గంగాధర్, మార్నేని రఘు, గుండా రాజశేఖర్, దండెబోయిన వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.