Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీ రూ.1.25 లక్షలు సాయం
నవతెలంగాణ-తొర్రూరు
ఉపాధ్యాయుడిగా ఎనలేని సేవలు అందించిన అబ్బాస్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు భరోసా ఇచ్చారు. అబ్బాస్ కరోనాతో మృతి చెందిన క్రమంలో మండల ఉపాధ్యాయుల నుంచి సేకరించిన రూ.1.25 లక్షల విరాళాలను మండలంలోని చీకటాయపాలెంలోని అబ్బాస్ కుటుంబ సభ్యులకు ఎంఈఓ గుగులోతు రాము అధ్యక్షతన మండల ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు. అబ్బాస్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు త్వరగా అందేలా చొరవ తీసుకుంటామని తెలిపారు. తొలుత అబ్బాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ బుచ్చయ్య, శ్రీనివాస్, భిక్షపతి, చంద్రమౌళి, యాకన్న, కిషన్‌నాయక్, నాగరాజు, రవీంద్రకుమార్, సైదులు, మోమిన్ అలీ, తదితరులు పాల్గొన్నారు.