Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి రాజమౌళి
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
దరఖాస్తు చేసిన అందరికీ రేషన్ కార్డ్ ఇవ్వాలని, కొత్తగా దరఖాస్తు చేసుకునేలా సైట్ ఓపెన్ చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి సమ్మెట రాజమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. 15 నెలలుగా కరోనాతో లక్షలాది మంది చనిపోతుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పనులు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. పేద కుటుంబాలకు నెలకు రూ.7,500లు, 16 రకాల నిత్యావసర సరుకులు అందించాలని, విద్యుత్ బిల్లు మాఫీ చేయాలని, అందరికీ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు దుడ్డెల రామ్మూర్తి, పాలబిందెల మల్లయ్య, రావుల రాజు, కుమ్మరికుంట్ల నాగన్న, హేమా నాయక్, బానోతు వెంకన్న, సిలుమోజు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
షరతుల్లేకుండా రేషన్ బియ్యం ఇవ్వాలి
మరిపెడ : ఆధార్, పాస్వర్డ్, తదితర షరతుల్లేకుండా పేదలందరికీ రేషన్ బియ్యం ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్బీఐ వద్ద ప్రజలతో మాట్లాడారు. బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడారు. కార్యక్రమంలో వ్యకాస మండల నాయకులు దొంతు సోమన్న, పాల్వాయి రామన్న, భీమానాయక్, రాము నాయక్, తదితరులు పాల్గొన్నారు.