Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రజాసంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ నల్లా నాగిరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని 23 మందికి రూ.7.68 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జెడ్పీ ఫ్లోర్‌లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మదార్తో కలిసి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలు ప్రయివేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని నష్టపోకూదనే ఉద్ధేశ్యంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు వీరమనేని యాకాంతరావు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ జరుపుల బాలునాయక్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఎర్రబెల్లి రాఘవరావు, మండల కో ఆప్షన్ సభ్యుడు సర్వర్ ఖాన్, ఎంపీటీసీ పురుషోత్తమ్, టీఆర్ఎస్వీ నాయకులు గజ్జి సంతోష్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సీసీ అలహరి వెంకట రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : సీఎంఆర్ఎఫ్ పేదలకు అండగా నిలుస్తోందని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు తెలిపారు. స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయంలో మండలంలోని 18 మంది లబ్దిదారులకు రూ.3.20 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడారు. కరోనా బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో చెక్కులు మంజూరు చేయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, నాయకులు కొమురయ్య, జైసింగ్, సురేందర్, సోమయ్య, వెంకన్న, మాటేడు ఎంపీటీసీ కిరణ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.