Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
అసాంఘీక శక్తులపై నిరంతరం నిఘా పెడుతున్నట్టు ఎస్పీ కోటిరెడ్డి తలిపారు. టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో లాక్డౌన్ సమయం నుంచి నమోదు చేసిన కేసులను వివరించారు. మాస్క్ లేకుండా బయటకొచ్చిన 3855 మందికి, సామాజిక దూరం పాటించని 1099 మందికి, గుమిగూడిన 375 మందికి, రాత్రి కర్ఫ్యూ ఉల్లంఘించిన 3580 మందికి, సిగిరెట్, బహిరంగ మద్యపానం, తదితరాల నేపథ్యంలో 164 మందికి జరిమానా విధించినట్టు తెలిపారు. లాక్డౌన్ సమయంలో అకారణంగా బయటకు వచ్చిన 10 వేల 500 వాహనాలు సీజ్ చేశామన్నారు. జిల్లాలో మొత్తం రూ.7 లక్షల విలువైన నిషేధిత అంబర్, గుట్కా, పాన్ మసాలా సీజ్ చేసినట్లు తెలిపారు. మొత్తం 10 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్ట్ అరెస్టు చేసినట్లు వివరించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.