Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ- ములుగు
వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఏటూరునాగారం ఐటీడీఏ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్.కష్ణ ఆదిత్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వానాకాలంలో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సంబంధిత తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్స్ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాల న్నారు. ముంపు గ్రామాల ప్రజలను తరలుంచుటకు ప్రభుత్వ పాఠశాల భవనాలను శుభ్రం చేయించి, అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. జిల్లాలో వర్ష ప్రభావిత వరదలు కాకుండా ప్రాజెక్ట్‌ల ద్వారా నీటిని వదిలినప్పుడు ముంపు ప్రాంతాలు నీట మునిగే అవకాశ ఉన్నందున అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారుర. రామప్ప, జంపన్న వాకు,తదితర లోతట్టు ప్రాంతాల్లో బారికెట్లు, జాకెట్స్, వాకిటాకిస్,బోట్స్ ముందస్తు గా ఏర్పాటు చేయాలని, శానిటేషన్ వర్కర్స్, వాలింటర్స్ లిస్ట్ తయారు చేసి పోన్ నెంబర్స్ తో సహా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో హనుమంతు కె జడంగి మాట్లాడుతూ రోడ్ల మరమ్మతులు చేపట్టి రవాణా వ్యవస్థ స్తంభించకుండా చూడాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఆదర్శ సురభి, ఏఎస్పీ గౌస్ ఆలం, ఇరిగేషన్ ఎస్ఈ విజరు భాస్కర్, డీటీడీవో ఎర్రన్న, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డా.అప్పయ్య, జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య, జిల్లా పరిషత్ సీఈఓ ప్రసూన రాణి, సంబంధిత మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.