Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు
నవతెలంగాణ-గోవిందరావుపేట
కరోనాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు అన్నారు. గురువారం క్వారంటైన్లో ఉన్న ప్రజలను డీపీఓ వెంకటయ్యతో పాటు సందర్శించి వారితో మాట్లాడారు. ఎటువంటి భయం అవసరం లేదని, ప్రతి ఒక్కరు కరొనాను జయించి పూర్తి ఆరోగ్యంగా కొలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. కరోనా బాధితులకు అవసరం అయిన పండ్లు, కూరగాయలు అందిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈసం సమ్మయ్య, కోఆప్షన్ సభ్యులు బాబర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గూడూరు శ్రీనివాసరావు, గ్రామ అధ్యక్షుడు భూరెడ్డి మధుసూదన్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, సంబశివరాజు, కీర్తి రవి, తుమ్మల శివ, గజ్జి మల్లికార్జున్, ఫక్రుద్దీన్, బొల్లం శివ, రేండ్ల సంతోష్ ఉన్నారు.
మృతులకు నివాళులు అర్పించిన జెడ్పీటీసీ...
మండల కేంద్రంలో ఇటీవల అకాల మరణం చెందిన పలు వురు మృతులకు జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, జిల్లా నాయకులు లక్ష్మణ్‌రావుతో కలిసి గురువారం నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. మండల ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు, సోదరుడు ఆలూరి నాగ విద్యారావు, గోవిందరావుపేట గ్రామ 7వ వార్డు సభ్యురాలు అల్లం నేని పద్మ, టీఆర్ఎస్ నాయకుడు కొమ్మరాజు అప్పారావు ఇంటికి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట కోఆప్షన్ సభ్యులు బాబర్, సర్పంచ్ ఈసం సమ్మయ్య, గోవిందరావుపేట ఉప సర్పంచ్ అల్లంనేని హనుమంతరావు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గూడూరు శ్రీనివాసరావు, కీర్తి రవి, తుమ్మల శివ, గజ్జి మల్లికార్జున్, చాల్వాయి అధ్యక్షుడు భూరెడ్డి మధుసూదన్‌రెడ్డి, బొల్లం ప్రసాద్, ఫక్రుద్దీన్, శివ, సాంబశివరావు పాల్గొన్నారు.