Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాప సభలో వక్తలు
నవతెలంగాణ-తొర్రూరు
అట్టడుగు వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం తుదివరకు పాటుపడిన మాడ్గుల నట్వర్ స్ఫూర్తి ప్రదాతని, ఆయన ఆశయ సాధనకు కంకణ బదులు కావాలని బాలాజీ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు నరుకుటి సంతోష్ అన్నారు. ఏడవ వార్డు కౌన్సిలర్ మాడ్గుల నట్వర్ అకాల మతికి సంతాపంగా సొసైటీ ఆధ్వర్యంలో గురువారం డివిజన్ కేంద్రంలోని యతి రాజారావు స్మారక పార్కులో సంతాప సభ ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ మతికి సంతాపం తెలిపి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ. నట్వర్ గొప్ప నాయకత్వ పటిమ కలిగిన నాయకుడని, క్లిష్ట పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవాడని గుర్తు చేశారు. పేదల సంక్షేమం కోసం నిత్యం పరితపించే వాడని, వారి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు వారి వెంట నడిచే వాడని తెలిపారు. మాజీ మంత్రి యతి రాజారావు దగ్గర రాజకీయ ఓనమాలు దిద్ది అనతికాలంలోనే ప్రజాభిమానం కలిగిన నేతగా గుర్తింపు పొందారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, ప్రస్తుత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల సూచనలు , మార్గనిర్దేశనంలో పట్టణ అభివద్ధికి అంకిత భావంతో పని చేశారని గుర్తు చేశారు. ఆయన కాలంగా మతి చెందడం పట్టణ అభివద్ధికి తీరని విఘాతమని, పేద ప్రజలు గొప్ప నాయకున్ని కోల్పోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు శార్ల కష్ణ, వెంకటేశ్వర్లు, రేవెల్లి గంగారాం, రేవెల్లి సోములు, కొండపల్లి శేషాద్రి, భూతం నరసింహ, సాయిలు, సంపత్, గీత, సాయిరాం గౌతమ్, సాయి, నాగమ్మ పాల్గొన్నారు.