Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
- కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
నవతెలంగాణ- తాడ్వాయి
కరోనా నుండి పేద ప్రజలు రక్షించుకోవడానికి కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని బీరెల్లి, నర్సాపూర్, అంకంపల్లి, ఆశన్నగూడ, ఎల్లాపూర్ గ్రామాల్లో కరోనా బాధితులకు, పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కరోనాతో పేదల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చితే చాలా మంది పేదల ప్రజలు బతికేవారన్నారు. లాక్డౌన్తో ప్రజలు, రోజు వారి కూలీలు ఇబ్బందులు పడుతున్న, సీఎం కేసీఆర్ పేద ప్రజల గురించి ఆలోచించక పోవడం బాధాకరమన్నారు. కరోనాతో మతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహార అందించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అల్లం సమ్మక్క, కాటాపూర్కు చెందిన బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ముజాఫర్ తల్లి ఇటీవలే మతి చెందగా వారిని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, మాజీ జెడ్పీటీసీ బోల్లు విజయ దేవేందర్, తాడ్వాయి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, సర్పంచ్లు ఇర్ప సునీల్, మంకిడి, నర్సింహా స్వామి, వట్టం సావిత్రి, మాజీ సర్పంచ్ బెజ్జూర్ శ్రీను, జిల్లా నాయకులు అర్రెం లచ్చుపటెల్, ముదురుకొల్ల తిరుపతయ్య, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పిరీల వెంకన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాక రాజేందర్, మండల యూత్ అధ్యక్షుడు సాయి రెడ్డి, చక్రపాణి,మేడం రమణకర్, నాయకులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ
మండలంలోని జర్నలిస్టులకు ఎమ్మెల్యే సీతక్క బియ్యం,నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు. మండలానికి చెందిన 15 మంది జర్నలిస్టులకు గురువారం గ్రామపంచాయతీ ఆవరణలో నిత్యావసర సరుకులు, బియ్యం తదితర సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ఎప్పడికప్పుడు వార్త సమాచారాన్నిసేకరించి గడ్డు సమయాల్లో నేను వారి సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, జిల్లా నాయకులు బొల్లు దేవేందర్, తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు గంట సాయి రెడ్డి, సర్పంచులు ఇర్ప సునీల్ దొర, నరసింహ స్వామి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పీరీల వెంకన్న పాల్గొన్నారు.