Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ అర్భన్ జిల్లా నూతన కలెక్టరేట్‌ను సుందరీ కరణ చేయాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అధి కారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నాం వరంగల్ అర్భన్ జిల్లా నూతన కలెక్టరేట్‌ను సందర్శించారు. ఆమెతో వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హను మంతు వున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ జిల్లాల ఆవిర్భావం అనంతరం జిల్లా ప్రధాన కార్యాలయాలు అన్ని ఒకేచోట సమీకృత జిల్లా కార్యాలయాల భవన సము దాయాలను ఏర్పాటు చేస్తున్నందునా, వీటిని సుందరీకరించా లన్నారు. భవనానికి నలువైపులా ప్రహరి గోడలకు వివిధ రకాల మొక్కలను నాటాలని, ఖాళీ ప్రదేశాలలో మియావాకి పద్దతిలో మొక్కలు నాటేలా చూడాలని, కార్యాలయానికి వచ్చే అధికారులు, ఇతరుల వాహనాల పార్కింగ్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, పెద్ద మొక్కలను నాటేలా చూడా లన్నారు. రోడ్డు మొదలుకొని కార్యాలయానికి వచ్చే మార్గంలో ఆకర్షిణీయంగా వుండేలా వివిధ రకాల అలంకృత పూల మొక్కలను నాటాలని, మురుగు కాలువ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ వాసుచంద్ర, డీఎఫ్ఓ అర్పన, ట్రాన్స్‌కో ఎస్ఇ లింగారెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ మనోహర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యాన అధికారి సునీత, హన్మకొండ తహశిల్దార్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.