Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికల్లో గెలుపు కోసమే..
- 'ఈటల' రాజీనామా నేపథ్యం..
నవతెలంగాణ-వరంగల్
హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపథ్యంలో టీిఆర్‌ఎస్ నాయకత్వం హుజురాబాద్ ప్రజలకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి రూ.40 కోట్లు విడుదల చేస్తూ ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేసింది. నాగార్జున్‌సాగర్ ఉప ఎన్నికకు ముందు కూడా టీఆర్ఎస్ ఇదే తరహాలో నిధులను విడుదల చేసింది. ఉప ఎన్నికల్లో గెలవడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహాలో విడుదల చేస్తుందన్న విషయం సర్వత్రా చర్చనీ యాంశంగా మారింది. 'ఈటల' ప్రాతినిధ్యం వహించిన ఈ నియో జకవర్గంలో ఇప్పటి వరకు నిధులు ఇవ్వకుండా, ఇప్పుడే ఎందుకు రూ.40 కోట్లు విడుదల చేసిందనే విషయం సైతం ప్రజలు చర్చించుకుంటు న్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హుజురాబాద్ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రతిరోజూ 3-6 గ్రామాలు పర్యటిస్తున్నారు. గురువారం ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో నియోజకవర్గం రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.
హుజురాబాద్ నియోజకవర్గంలో 'ఈటల' ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక అధికార టిఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గానికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇప్పటికే రూ.40 కోట్ల నిధులను నియో జకవర్గ అభివృద్ధి కోసం విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గంలో త్వరలో జరుగబోయే ఉప ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ఒక్కో మండలానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కేటాయించడంతో ప్రతి ఒక్కరు రోజుకో 3-6 గ్రామాల్లో పర్యటిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ వారందరినీ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.
అన్ని అభివృద్ధి చేస్తం..
టిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం డైరెక్షన్లో నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దూతలుగా వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే లేరు కాబట్టి ఈ మండలం అభివృద్ధిని చేసే బాధ్యత నాదేనని, ఏం పనులు కావాలన్న చేసే బాధ్యత మాదేనంటు హామిలిస్తున్నారు. పనిలో పనిగా ఇప్పటి వరకు నియోజకవర్గం అభివృద్ధి కాలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఏకంగా హుజురాబాద్ మున్సిపాల్టీ దుమ్ము, దూళితో నిండిపోయిందని, హుజురాబాద్ రూపురేఖలు మార్చే బాధ్యత నాదేనని హామిలిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగొద్దంటే టిఆర్ఎస్ను గెలిపించాలంటున్నారు. సీఎం కేసీఆర్ దూతగా వచ్చానంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెబుతున్నారు. మరోవైపు మంత్రి కొప్పుల ఈశ్వర్ వాగుల మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. నియోజకవర్గంలో టిఆర్ఎస్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతుంది. కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామని, డ్రైనేజీలను నిర్మిస్తామంటూ హామిలిస్తున్నారు. త్వరలోనే నిధులు వస్తాయని అన్ని పనులు చేస్తామని హామిలు గుప్పిస్తున్నారు.
'ఈటల'పై విమర్శలు
ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల రాజేందర్ బిజెపిలో చేరాడని మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఆత్మగౌరవమంటున్న 'ఈటల' ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తున్నారు. దమ్ముంటే స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలవాలని సవాల్ పరకాల ఎమ్మెల్యే 'చల్లా' సవాల్ విసిరారు. 'ఈటల' చట్టవ్యతిరేకమని తెలిసినా తాను కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను ఎందుకు ప్రభుత్వానికి స్వాధీనపరచలేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 'ఈటల'ను విమర్శించడానికి పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. తద్వారా టిఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో పడితే నామినేటెడ్ పదవులు, ఇతర అవకాశాలు దక్కుతాయని ఆశాభావంతో పోటీపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.
కమలాపూర్‌లో 6 గ్రామాల్లో 'చల్లా' పర్యటన
'ఈటల' సొంత మండలం కమలాపూర్‌లో మండల ఇన్‌ఛార్జి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 6 గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నేరెళ్ల, లక్ష్మీపూర్, పంగిడిపల్లి, వంగపల్లి, మరిపెల్లిగూడెం, మరిపెల్లి గ్రామాల్లో పర్యటించారు. తెలంగాణవాదులంతా టిఆర్ఎస్ వెంటే వున్నామని చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు. టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధి చేసుకుంటామని ప్రజలు చెబుతున్నట్లు 'చల్లా' చెప్పడమే కాకుండా మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతున్నారు.
4 గ్రామాల్లో ఈటల జమున పర్యటన
కమలాపూర్ మండలంలో 4 గ్రామాల్లో ఈటల రాజేందర్ సతీమణి జమున పర్యటించారు. కమలాపూర్ మండలానికి చేరుకోగానే బిజెపి కార్యకర్తలు, 'ఈటల' అనుచరులు జమునకు ఘనంగా స్వాగతం పలికారు. శనిగరం, లక్ష్మీపురం, గోపాల్పూర్, బత్తివానిపల్లి గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 'ఈటల'కు చేసిన అవమానాలను ఏకరువు పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే 'ఈటల'ను అణిచివేయడానికే కేసులు పెట్టారని, ఈ ఉప ఎన్నికలో గెలిపించడం ద్వారా నియంతృత్వాన్ని ఎదిరించాలని, ఆత్మగౌరవాన్ని నిలపెట్టాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అటు టిఆర్ఎష్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు, ఇటు ఈటల రాజేందర్, ఆయన సతీమణి ప్రచారం ముమ్మరం చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. త్వరలో బిజెపి ప్రజాప్రతినిధులు, నేతలు రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.
ఎటువంటి సంబంధం లేదు
గుజ్జుల రాంగోపాల్ రెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాయిత మాధవరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ మాట్లాడారు. అక్రమ మొరం రవాణా దందాను ప్రశ్నించిన షోడశపల్లి గ్రామస్తులపై దాడి జరిగినట్టు గ్రామస్తులు తన వద్దకు వచ్చి చెప్పారన్నారు. అక్రమంగామొరం తవ్వకాలు చేపడుతున్న ప్రదేశానికి ఏఎంసి వైస్ చైర్మన్ గుజ్జుల రాంగోపాల్ రెడ్డి షోడశ పల్లి ఉపసర్పంచ్ కీర్తి రమేష్‌తో పాటు 20 మంది గ్రామస్తులు, విలేకరులతో కలిసి తాను వెళ్లి సందర్శించిన అనంతరం వేలేరు పోలిస్ స్టేషన్, తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. అనంతరం మైనింగ్ ఏడీకి ఫిర్యాదు చేశానని అన్నారు. కలెక్టర్‌కు షోడశ పల్లి సర్పంచ్ ఫిర్యాదు చేశారన్నారు. అప్పుడు మాత్రమే తాసిల్దార్ విజయలక్ష్మి అక్రమ మట్టి మొరం రవాణా క్రమంలో హిటాచీ వాహనాన్ని సీజ్ చేశారని అన్నారు. కొన్ని రోజులకు వాహన యజమానులు తన వద్దకు వచ్చి ప్రభుత్వ నిబంధనల మేరకు జరిమానా కట్టడానికి సిద్ధపడి తాసిల్దార్ వద్దకు వెళ్తే లంచం అడిగినట్టు తనకు తెలిపారని అన్నారు. దీంతో తాను తాసిల్దార్ దగ్గరికి నిబంధనల మేరకు జరిమానా విధించాలని సూచించామన్నారు. అయినప్పటికీ రూ.25వేలు జరిమానా విధించి రూ.75000 ఐసోలేషన్ నిర్వహణకు విరాళం రాయించుకోవడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఒకవేళ జరిమానా విధిస్తే లక్ష రూపాయల జరిమానా విధించవచ్చు కదా అని ప్రశ్నించారు. గతంలో పర్వతగిరిలో పనిచేసినప్పుడు తాసిల్దార్ విజయలక్ష్మి లంచం తీసుకున్న విషయం తన దష్టికి కూడా వచ్చిందని అన్నారు. అందుకే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఆడియో ద్వారా పల్లా రాజేశ్వర్ రెడ్డిని, తను అసత్య ప్రచారాలు చేస్తున్నారనే ప్రచారాలు మానుకోవాలన్నారు. దీని వెనుక కొంతమంది లంచగొండి అధికారుల, ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆరోపించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మండల అభివద్ధి కోసం, ప్రజల శ్రేయస్సుకోసం పల్లా కషి చేస్తారని, తాను కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కీర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ షోడశపల్లి-లోక్యా తండా గ్రామల మద్య అక్రమ మొరం రవాణా దందా ను ప్రశ్నించిన షోడశ పల్లి గ్రామ ప్రజలు, వెలుగులోకి తీసుకొచ్చిన విలేఖరుల పై దాడికి పాల్పడిన లోక్యా తండా సర్పంచ్ మురావత్ అనురాధ భర్త మురావత్ లింగం చర్యలను ఖండిస్తూన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గోదెల రాజిరెడ్డి , జోడుముంతల రమేష్, కొట్టే రాజేష్, మండల తెరాస అధికార ప్రతినిధి జోగు ప్రసాద్, కిరణ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.