Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు నేరస్తుల అరెస్ట్
- 2 సెల్ ఫోన్లు, రాగి పిండి బస్తాలు బ్యాటరీ,హౌండా యాక్టివా వాహనం స్వాధీనం
నవతెలంగాణ-శాయంపేట
జల్సాలకు అలవాటుపడి దారి దోపిడీకి పాల్పడుతున్న నేరస్తు లను సంఘటన జరిగిన 48 గంటల్లో పట్టుకుని కేసును ఛేదించి ఇద్దరు నేరస్తులను అరెస్టు చేసినట్టు పరకాల ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. వారి నుంచి రూ.24 వేల విలువైన 2 సెల్ ఫోన్లు, రాగి పిండి బస్తాలు, బ్యాటరీ, హీరో హౌండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గురువారం ఏసీపీ విలేకర్ల సమా వేశంలో వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు మండలానికి చెందిన తనుగుల రాజు, వరంగల్ పైడిపల్లి కొత్తగూడెం కాలనీకి చెందిన జన్ను అజరు వరుసకు బావమర్దులు. తాగుడుకు, విలాసాలకు బానిసలై డబ్బులు సరిపోక దారి దోపిడీకి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 14న మోటర్ సైకిల్ పై గూడెపాడు వైపు వెళ్తూ దామెర క్రాస్ వద్ద వాహనం కోసం ఎదురు చూస్తున్న గణేష్‌ను ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రదేశంలో స్కూటీని ఆపి గణేష్ ను బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ గుంజుకున్నారు. నిందితులిద్దరూ ఓగులాపూర్ సైలని బాబా దర్గా వద్ద నేషనల్ హైవే పక్కన పాడైపోయి ఆగి ఉన్న టాటా ఏసీ డ్రైవర్ కోడెపాక కుమారస్వామిని బెదిరించి సెల్ ఫోన్ గుంజుకున్నారు. టాటా ఏస్ లోని 23 రాగి మాల్ట్ బస్తాలలో నుండి 6 బస్తాలు దొంగిలించారు. గణేష్, కుమారస్వామిలిద్దరు దామెర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గురువారం ఊరుగొండ శివారు కె ఎస్ ఆర్ స్కూల్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టగా నిందితులు బైక్‌పై ములుగు వైపు వస్తున్నారు. తనికీ చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను వరంగల్ సీపీ తరుణ్ జోషి అభినం దించారు