Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలం కేంద్రంలోని రూర్బన్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిలో రూర్బన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తున్నారు. కాగా పదేండ్లుగా అదే భూమిలో సాగుచేస్తున్న మండల కేంద్రానికి చెందిన మంతుర్తి కుమారస్వామి కుటుంబ సభ్యులు భూమికి బదులు భూమి గానీ ఆర్థిక సహాయం అందించాలని గురువారం నిరసన తెలిపి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ. మండల కేంద్రం లో సుమారు 250 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ పేద కుటుంబానికి చెందిన భూమిని ఉద్దేశపూర్వకంగా రూర్బన్ ప్రాజెక్టుల కోసం కేటాయించారని అన్నారు. ఆర్థిక సహా యం చేసే భూమిని తీసుకోవాలన్నారు. లేదంటే భూమికి భూమి కేటాయించాలన్నారు. భూమి పోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.