Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ రాయపర్తి
కరోనా నిర్మూలనకు ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని మైలారం గ్రామ సర్పంచ్ లెతాకుల సుమతి యాదవ రెడ్డి అన్నారు. గురువారం గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లా డుతూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించడం వల్ల కరోనాను కట్టడి చేయొచ్చ న్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో కరోనా కేసుల శాతం తగ్గాలి అంటే మాస్కులు ధరిం చడంలో అలసత్వాన్ని విడనాడాలని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ అష్రఫ్,ఉప సర్పంచ్ బాధ సారయ్య,వార్డు సభ్యులు పరిపాటి రవిందర్ రెడ్డి,పరిపాటి రాజు రెడ్డి,గాడిపెల్లి రాములు, బోయిని పెద్దులు,శ్రీనువాస్ నాయక్,మెరుపోజు గీత,తదితరులు పాల్గొన్నారు.