Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటారం డీఎస్పీ బోనాల కిషన్
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కాటారం డీఎస్పీ బోనాల కిషన్ మందులు దుకాణం యజ మానులను హెచ్చరించారు. తాడిచెర్ల, పెద్దతూండ్ల గ్రామాల్లోని ఎరువుల, విత్తనాల దుకాణం దారులు నకిలీ విత్తనాలు అమ్ము తున్నారనే సమాచారం మేరకు గురువారం కాటారం సిఐ హాథిరామ్, కోయ్యుర్ ఎస్ఐ సత్యనారాయణ వ్యవసాయ అధికారి మహేష్ తాడిచెర్ల, పెద్దతూండ్ల గ్రామాల్లోని రాజరాజేశ్వర, తిరుమల ఎరువుల విత్తనాల దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందులు, హెచ్ టి పత్తి విత్తనాలు, గ్లైపోసెట్ మందును డీలర్లు అమ్మరదాని సూచించారు. ప్రతి డీలర్ విత్తనాలు తెచ్చేటప్పుడు బిల్లులు,సోర్స్ సర్టిఫికెట్ తెచ్చుకోవలన్నారు. గిఆర్సీ నెంబర్ ఉన్న పత్తి విత్తనాలను రైతులు కోణాలన్నారు.రసీదులు పంట కాలం వరకు దాచుకోవాలని సూచించారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, క్యూ ఆర్ కోడ్ లను పరిశీలించారు. అనంతరం ఏఎమ్మార్ మ్యాక్జిన్ (మందు గుండు సామాగ్రి)ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.