Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యం అందిస్తున్న వైద్యులకు రక్షణ అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పై ఉన్నదని, వైద్యం అందిస్తున్న కొన్ని సందర్భాలలో రోగి ప్రాణాలు కోల్పోతే వైద్యం చేస్తున్న డాక్టర్లపై రోగి బంధువులు భౌతిక దాడులకు దిగడం దురదష్టకరమని, ఆలాంటి దాడులు పునరావతం కాకుండా కఠిన చట్టాలు తీసు కురావాలని ఐఎంఏ వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పి సుధీర్ కుమార్ డిమాండ్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు నేడు నేషనల్ ప్రొటెక్షన్ డే లో భాగంగా సేవ్ ద సేవియర్ అనే స్లోగన్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆసు పత్రుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. గురువారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ విజంభిస్తున్న తరుణంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం అన్యాయమని అన్నారు. దేశవ్యాప్తంగా గత సంవత్సరం 1058 మంది వైద్యులు కోవిడ్‌తో మరణించారని అన్నారు. ఈ సంవత్సరం 750 మంది మత్యువాత పడ్డారని, వరంగల్ జిల్లాలో 10మంది మతిచెందారని అన్నారు. ి ఆస్పత్రి పై దాడి చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ప్రత్యేక కోర్టు ద్వారా కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. కోవిడ్ చికిత్సలో మతిచెందిన వైద్యుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ఈమేరకు కలెక్టర్‌తో పాటు ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలను అందజేస్తామన్నారు. వరంగల్ జిల్లా ఐఎంఏ సెక్రెటరీ డాక్టర్ ప్రభాకర్, కోశాధికారి డాక్టర్ రాజా మోహన్, డాక్టర్ విజరు చందర్, డాక్టర్ బందెల మోహన్‌రావు పాల్గొన్నారు.