Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వడానికి సబ్ కమిటీకి సిఫార్సు చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ధరావత్ మోహన్ నాయక్ కోరారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లా డుతూ పౌరసరఫరాల శాఖ ద్వారా యేండ్ల తరబడి చాలీచా లని కమీషన్‌తో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులను అందజేస్తున్నారని తెలిపారు. రేషన్ డీలర్ల ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగి స్తున్నారన్నారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు రూ.30,000 గౌరవ వేతనం లేదా క్వింటాకు రూ.250ల కమీషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ డీలర్లు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ఏర్పర్చిన సబ్ కమిటీకి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సానూకూలంగా స్పందిస్తూ రేషన్ డీలర్ల సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని ఈ దిశగా కమిటీలోని మంత్రుల దృష్టికి తీసికెళ్లి సంతృప్తికరమైన నిర్ణయం వెలువడేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు సోలంకి లింగయ్య, ప్రధాన కార్యదర్శి బండారు రమేష్, దుగ్గొండి మండల అధ్యక్షులు సంకేసి కమలాకర్, నర్సంపేట మండల అధ్యక్షులు అనంతుల రాంనారాయణ, చెన్నారావుపేట మండల అధ్యక్షులు ఆకుల మనోహర్ స్వామి డీలర్లు సుధాకర్, సంపత్, సంతోష్, నానీ పాల్గొన్నారు.