Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
రైతులు విత్తనోత్పత్తి, విత్తన శుద్దీకరణ చేసి ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజషన్కు ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ.60 లక్షలతో 100 శాతం సబ్సిడీతో మంజూరైన విత్తనోత్పత్తి, విత్తన శుద్దీకరణ, గోదాముల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలుజేస్తూ దేశానికే ఆదర్శకంగా నిలిచిందన్నారు. పంటకు రైతులే ధర నిర్ణయించుకునే రోజులు రావాల్సిన అవసరముందన్నారు. ఇందుకు నియోజవర్గంలో రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేసి రాయితీలను అందిస్తున్నామన్నారు. అనతిలోనే పలు సంఘాలు పంటల దిగుబడులను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చాయని, విత్తన, ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ వ్యాపారం చేసే స్థాయికి ఎదగడం రైతుల ఐక్యతకు నిదర్శనమన్నారు. విత్తనోత్పత్తి, విత్తనశుద్ధీకరణ చేసి నాణ్యమైన విత్తనాలను రైతులకు తక్కువ ధరకే అందించొచ్చన్నారు. దీనివల్ల సంఘం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ రైతు బంధు సహాయ నిధి అందిస్తున్నాడని తెలిపారు. నిన్నటి వరకు ఆక్సిజన్ కొనుగోలు చేయడానికి కూడా ఖజానా లేని సమయంలో ఎంతో సాహౌతోపింగా రూ.7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని అన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ టీ.శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మెన్ మునిగాల వెంకట్ రెడ్డి, ఎంపీపీ మోతె కలమ్మ, వార్డు కౌన్సిలర్ ఎండీ.పాషా, ఎఫ్పీవో ప్రతినిధులు చిలువేరు కుమారస్వామి, ఏవో కృష్ణ కుమార్, ఏఈవో మెండు అశోక్ పాల్గొన్నారు.
విత్తనోత్పత్తి కేంద్రం పనులకు శంకుస్థాపన
ఖానాపురం : మండల పరిధి బుధరావుపేటలో వందశాతం సబ్సిడీతో ''గ్రాంట్-ఇన్-ఎయిడ్ ద్వారా రూ.60 లక్షలతో విత్తనోత్పత్తి, విత్తన శుద్దీకరణ , విత్తనాల నిల్వ గోదాముల నిర్మాణ పనులకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ధి సుదర్శన్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని రైతు సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైన సిద్దపడుతారన్నారు. రైతులు పండించిన పంటలకుల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి సంఘం యొక్క ఆర్థికాభివద్ధికి పాటుపడాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సమస్యలపై ఏకం కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 రైతు ఉత్పత్తి సంఘాలను ప్రతిపాదిస్తే నర్సంపేట నియోజకవర్గంనకు రెండు మంజూరు చేశారన్నారు. నర్సంపేటలో విగేశ్వర రైతు ఉత్పత్తి సంఘం, ఖానాపురం మండలం బుధరావుపేట రైతు ఉత్పత్తి సంఘంనకు మంజూరు చేసినట్టు తెలిపారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, జెడ్పీటీసీ స్వప్న, ఓడీసీిఎంఎస్ చైర్మెన్ రామస్వామినాయక్, ఎంపీటీసీలు పూల్సింగ్, బిక్కిలింగమ్మ, సుభాన్భీ, రైతు ఉత్పత్తి సంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహలక్ష్మి వెంకటనర్సయ్య, వెంకటరెడ్డి, ఏడీ శ్రీనివాస్, ఎవో బి శ్రీనివాస్ పాల్గొన్నారు.