Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి అధికారులు, పాలకులపై చర్యలు తీసుకోవాలి
-ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం
- కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటాం
- ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడాలి. జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న అధికారులు, పాలకులపై చర్యలు తీసుకోవాలి. ప్రయివేటు వ్యక్తులు కబ్జాలు చేస్తున్న కోట్ల విలువైన భూములను కాపాడుకుంటాం.' అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం నుంచి భూపాలపల్లి ఫారెస్ట్ 160 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. 116 ఎకరాల్లో పార్కు ఉందని, 32 ఎకరాలు జగన్ పల్లి రైతులకు చెందినవన్నారు. రూ.1,100 కోట్ల విలువ చేసే ఈ భూములపై ప్రైవేటు వ్యక్తులు భూమి తమదేనంటూ కోర్టు నుంచి ఆర్డర్ కాపీలు తెచ్చారని ఆరోపించారు. ఇట్టి భూములపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున హైకోర్టులో పిల్ దాఖలు చేశామన్నారు. ప్రభుత్వ భూములను ప్రజల పక్షాన పోరాటాలు చేసైనా కాపాడుకుంటామన్నారు. గణపురం,మొగుళ్లపల్లి, భూపాలపల్లి, మండలాలకు చెందిన కరోనా, బ్లాక్ ఫంగస్ బాధితులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే రూ.7వేల విలువైన ఇంజక్షన్‌కు బ్లాక్ మార్కెట్లో రూ.50 వేలకు కొనుగోలు చేసి నష్టపోతున్నారని అన్నారు. కరోనాను బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ లో చేర్చి మెరుగైన వైద్యమందించాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల మరణించిన కుటుంబాలకు రూ.10లక్షలు నష్టపరిహారం అందించాలని అన్నారు. వంద పడకల ఆసుపత్రిని పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలో 50 కిలోలకు 5 కిలోలు కోత విధిస్తున్న రైస్ మిల్లర్లు, అధికారులు, పాలకులపై చర్యలు తీసుకోవాలని. డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలన్నారు. 2013 రెవెన్యూ భూ చట్టం ప్రకారం ఘనపురం మండలం లోని దుబ్బ పల్లి పరిసర గ్రామాల్లోని భూములకు ధర నిర్ణయించి ప్రజలను ఆదుకోవాలన్నారు. బొగ్గు కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. నియోజకవర్గ ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తామని ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటామని అన్నారు.
పోడు భూములకు పట్టాలివ్వాలని అంబేద్కర్ సెంటర్ లో ధర్నా
ఎన్నో ఏళ్లుగా పోడు చేసుకొని కొనసాగిస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతు పోడు భూములలో సాగు చేసుకుని జీవిస్తున్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ఫారెస్ట్ అధికారులకు అదేశాలివ్వాలన్నారు. లేదంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. రైతులు పడించిన పంటకు తాలు, మొలక ఉన్నాయని సాకులు చెప్పకుండా కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజయ్య తోట సంతోష్,ముకిరాల మదువంశీ, ఎర్రబెల్లీ రామేశ్వరర్ రావు,అంబాల శ్రీని,రాంనేని రవీందర్,బుర్ర కొమురయ్య, కిష్టయ్య, రవి, రాజయ్య, నక్క భాస్కర్, తక్కలపెళ్లి రాజు, పిప్పాల రాజేందర్, తోట రంజిత్, దబ్బేట అనిల్, రజనీకాంత్, సురేష్, పథ్వి, ప్రదీప్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు