Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ సిబ్బందిని విస్మరించడం సరికాదని సీఐటీయూ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు గుర్రం లాజర్ అన్నారు. గురువారం మండలంలోని శివునిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో కలిసి పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16నెలలుగా కరోనా విపత్తులో సైతం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్న జీపీ కార్మికులను విస్మరించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో జీతాలు పెంపు సరందేనని, కాగా రెక్కలు ముక్కలు చేసుకొని ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో శ్రమిస్తున్న తమను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వీడాలని అన్నారు. 60, 64 జీఓల విడుదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. తగిన కష్టానికి నామమాత్రపు వేతనాలు తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రస్తుత ధరల గమనించి జీపీ సిబ్బంది వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, ప్రవీణ్, రాజు, వినరు, విజరు,సునీల్, కుమార్, రవి, ధర్మరాజు, ఎల్లమ్మ, సునీత, సుజాత అండాలు, పుష్ప, స్వరూప, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.