Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కార్పొరేటర్, ప్రయివేటు జూనియర్ కళాశాల అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఫీజుల వసూళ్లను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాకేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ... తల్లిదండ్రులు ఆరుగాలం కష్టపడి తమ పిల్లలకు ఉన్నత చదివించాలనే ఆశతో ప్రైవేటు కళాశాలలో చదివిస్తుంటే కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూళ్లకు పాల్పడుతూ మోసగిస్తున్నాయని విమర్శించారు. ఫీజులు చెల్లించలేని స్థితిలో విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు చెల్లించకుంటే టీసీలను ఇవ్వకుండా యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడడం సరైందింకాదన్నారు. అధిక ఫీజుల వసూళ్లను ప్రభుత్వం నియంత్రించకపోవడంతో అనేక మంది విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. వెంటనే యాజమాన్యాలు అధిక ఫీజుల వసూళ్లకు స్వస్తి పలికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివరాత్రి ప్రశాంత్, మహేష్,రెహమాన్, అఖిల్, మహేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.