Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ సీఈవో రాజారావు
నవతెలంగాణ-శాయంపేట
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి పంచాయితీ కార్యదర్శులు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలని జడ్పీ సీఈవో రాజా రావు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈఓ రాజారావు పాల్గొని మాట్లాడారు. నర్సరీలలో పెంచిన మొక్కలను ప్రతి ఇంటికి ఐదు మొక్కల చొప్పున పెంచేలా చూడాలని, రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో మొక్కలను నాటాలని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, మల్టీపర్పస్ వర్కర్లతో ఉదయం 6 గంటల నుండి మురికి కాలువలు శుభ్రం చేయడం, రోడ్డుకిరువైపులా చెత్తాచెదారం తొలగించడం, పిచ్చి మొక్కలు తొలగించడం వంటి పనులను చేయించాలని తెలిపారు. గుంతలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. దీంతో దోమలు ప్రబలే అవకాశాలు ఉండవని తెలిపారు. అనంతరం శానిటేషన్, ప్లాంటేషన్ కార్యక్రమాలపై గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎల్పీవో కల్పన, ఎంపిఓ రంజిత్ కుమార్, ఏపీవో కీర్తి అనిత, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.