Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
మసకబారిన బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కమిషన్లకు మోక్షం ఎప్పుడోనని తెలంగాణ రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ బీసీ అధికార ప్రతినిధి దాసు సురేష్ ఒక ప్రకటనలో విడుదల చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2010లో సుప్రీంకోర్టు నిర్ధేశించిన ఆదేశాల మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక, తమిళనాడు, కరళ ప్రాంతంలో కమిషన్లు నిరంతరంగా ,సమర్ధవంతంగా పనిచేస్తూ నిమ్నవర్గాల ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తుంటే తెలంగాణలో మాత్రం పరిస్థితులు ఇందుకు విభిన్నంగా నెలకొన్నాయన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ ,బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ తో సహా 5 బీసీ కులవత్తుల కార్పొరేషన్లు ,11 ఫెడరేషన్లకు అనేక సంవత్సరాలుగా పాలకవర్గాలు లేక సమస్యలు పేరుకపోతూ బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు . ప్రభుత్వ నిర్ణ యాలలో కొనసాగుతున్న తాత్సారం వల్ల రాష్ట్రంలో చేతివత్తులు, కుల వత్తులు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయని మండి పడ్డారు.బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు 50 శాతం తగ్గకుండా అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లకు పూర్తిస్థాయిలో రాజ్యాంగ హౌదా కల్పిస్తూ వెంటనే ప్రభుత్వం కమీషన్లను ప్రారంభించాలన్నారు.