Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక అధికారి సుదర్శన్ రాథోడ్
నవతెలంగాణ-మల్హర్రావు
గ్రామాల్లో పారిశుధ్యంపై సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ రాథోడ్ హెచ్చరించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కష్ణ అదిత్య ఆదేశాల మేరకు మండల ఎంపీడీవో నరసింహమూర్తితో కలిసి శుక్రవారం వల్లెంకుంట, తాడిచెర్ల, కొయ్యుర్,మల్లారం గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక శానిటేషన్ పారిశుధ్యం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం పారిశుధ్యం పనులు ముమ్మరంగా చేపట్టాలని, రోడ్లకు ఇరువైపులా ముళ్ల పొదలు, చెత్త,చెదారం, రాళ్లు,పిచ్చి చెట్లు లేకుండా చేయాలన్నారు. అలాగే మురికి కాల్వలు, చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తీసివేయలని సూచించారు. నర్సరీల పై ప్రత్యేక దష్టి సారించాలని, మొక్కలు నాటుటకు అనువుగా ఉన్న స్థలాలను గుర్తించి, గుంతలు తవ్వే పనులు చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్యంతోపాటు హరితహారం పై కూడా ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. లేని పక్షంలో సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ,రాము, నరేశ్, ప్రసాద్ పాల్గొన్నారు.