Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భోజనం సమకూర్చుతున్న సర్పంచ్
నవతెలంగాణ-శాయంపేట
వద్ధాప్యంలో కన్నకుమారులు అండగా ఉంటారని ఆశపడిన వద్ధురాలికి ఆశలు అడియాశలయ్యాయి. కుమారులు ఇంట్లో నుండి బయటకు గెంటి వేసి ఇంటికి తాళం వేసుకొని వెళ్లడంతో గత రెండు నెలలుగా ఇంటి అరుగుమీద ఆమె నివసిస్తుంది. వద్ధురాలి దీనావస్థను గమనించి స్థానిక సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య ప్రతిరోజూ భోజనం సమకూర్చుతున్నాడు. వద్ధురాలు కథనం ప్రకారం.... మండలంలోని గట్లకానీపర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన శాంతమ్మ - సారయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. సారయ్య వత్తిరీత్యా చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. గత 20 ఏళ్ల క్రితం సారయ్య మతి చెందడంతో ఇద్దరు కుమారుల వద్ద శాంతమ్మ ఉంటుంది. ఆమె పెద్ద కుమారుడు మొగిలి మహారాష్ట్ర లో ఉంటుండగా, చిన్న కుమారుడు సాంబయ్య ఆత్మకూరు మండలం కటాక్షపూర్ లో ఉంటున్నారు. దీంతో గత రెండు నెలల క్రితం శాంతమ్మ ను ఇంటి నుండి బయటకు గెంటి వేసి ఇంటికి తాళం వేసుకొని కుమారులు వెళ్లిపోయినట్లు తెలి పారు. దీంతో ఇంటి అరుగు పైన వద్ధురాలు నివసిస్తుంది. వద్ధురాలి దీనావస్థను గమనించిన స్థానిక సర్పంచ్ బొమ్మ కంటి సాంబయ్య వద్ధు రాలికి భోజనం ప్రతిరోజు సమకూర్చుతున్నాడు. ఇదే విషయమై సర్పంచ్ కుమారులను ఫోన్లో సంప్రదించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ కాలం దాట వేస్తున్నట్లు తెలిపారు. తన కుమారులతో తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని శాంతమ్మ వేడుకుంటుంది.