Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ప్రస్తుత వానాకాల సీజన్లో ప్రతిఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలని పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి కోరారు. పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రావుల శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీపీ రాజేశ్వరి మాట్లాడారు. నీరు నిల్వకుండా చూడాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు వ్యాప్తి చెందుతాయని, అంటువ్యాధులు ప్రబలుతాయని వివరించారు. గ్రామంలో డ్రెయినేజీని క్లీనింగ్ చేయించి దోమల నివారణ మందు పిచికారీ చేయించాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, పైప్లైన్లు లీకేజీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రకతి వనాన్ని, నర్సరీని పరిశీలించారు. ఆ మండలంలోని అన్ని గ్రామాల వారీగా హరితహారం మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీడీఓకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషాద్రి, జూనియర్ పంచాయతీ కార్యదర్శి రాజు, ఏఎన్ఎమ్ మేరీ, ఆశ వర్కర్లు పులుగుజ్జా శోభ, ఈదురు అనిత, అంగన్వాడీ టీచర్లు ఈదురు శోభ, పులుగుజ్జా రాజేశ్వరి, కారోబార్ శ్రీకాంత్, వాటర్ మ్యాన్ భిక్షపతి, సోమ్మల్లు, తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : మండల కేంద్రంలో సర్పంచ్ నూనావత్ రమేష్ ఆధ్వర్యంలో డ్రైడే నిర్వహించారు. పంచాయతీ సిబ్బందితో ఇండ్లలోని నిల్వ ఉన్న నీటి నిల్వలను తొలగించారు. అనంతరం సర్పంచ్ రమేష్ మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం నర్సరీని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంపత్, పంచాయతీ కార్యదర్శి దేవా, వార్డు సభ్యుడు శివ, తదితరులు పాల్గొన్నారు.